పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వచ్చి భారత్‌లో చేరాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆదివారం బీజేపీ తనపున ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పీఓకే(POK) ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ ఈ పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌కు పీఓకే ప్రజలు ఎప్పటికీ విదేశీయులేనని, పీఓకేని కూడా వారు ఇప్పటికీ విదేశీ భూభాగంగానే పరిగణిస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమైని, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రత పెరిగిందని, భద్రత పరంగా కేంద్రం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని చెప్పారాయన. గతంలో రివాల్వర్లు, కత్తులు పట్టుకుని తిరిగిన యువత చేతిలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం సరికాదని, బీజేపీ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో బీజేపీ(BJP)కి మద్దతు ఇస్తే స్థానికంగా మరిన్ని అభివృద్ధి జరుగుతుంది. తమకు పాక్‌తో కలిసి ఉండటం ఇష్టం లేదని భారత్‌కు వెళ్తామని పీఓకేలోని ప్రజలే అనేలా చెప్పేలా అభివృద్ధి చేస్తాం. పాక్ ఇప్పటికి కూడా పీఓకేని విదేశీ భూభాగంగానే చూస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అదనపు సోలిసిటర్ జనరల్ కూడా ఇటీవల తన ప్రమాణపత్రంలో చెప్పారు’’ అని గుర్తు చేశారు రాజ్‌నాథ్(Rajnath Singh).