Congress MP Santokh Singh Dies of heart Attack During Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఉదయం పంజాబ్ ఫిల్లౌర్ లో జరుగుతున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి కాసేపు నడిచిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సంతోఖ్ సీంగ్(MP Santokh Singh) గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణ వార్త విని రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.