2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో 16 మందితో పార్టీ ఎన్నికల కమిటీని కాంగ్రెస్(Congress) అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో ఖర్గేతో పాటు పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తదితరులకు చోటు దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం విశేషం.
Congress Party కమిటీ సభ్యులు ఎవరంటే..
➞ మల్లికార్జున ఖర్గే
➞ సోనియా గాంధీ
➞ రాహుల్ గాంధీ
➞ అంబికా సోనీ
➞ అధిర్ రంజన్ చౌదరి
➞ సల్మాన్ ఖుర్షీద్
➞ మధుసూదన్ మిస్త్రీ
➞ ఉత్తమ్ కుమార్ రెడ్డి
➞ టీఎస్ సింగ్ ఢియో
➞ కేజే జార్జ్
➞ ప్రీతమ్ సింగ్
➞ మొహమ్మద్ జవెద్
➞ అమీ యజ్నిక్
➞ పీఎల్ పునియా
➞ ఓంకార్ మార్కమ్
➞ కేసీ వేణుగోపాల్