congress wins himachal pradesh assembly elections: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ కి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయింది. 68 స్థానాల్లో.. 39 సీట్ల సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం జైరాం ఠాకూర్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. మరికాసేపట్లో రాజీనామా లేఖను గవర్నర్ కి అందించనున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును శిరసా వహిస్తానని.. నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వరుసగా ఏ పార్టీ రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. అదే సంప్రదాయాన్ని కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ అదే స్ఫూర్తి తో హిమాచల్ లో ఎన్నిక ప్రచారం నిర్వహించినా ఆ పార్టీ జాడే లేకుండాపోయింది. ఇక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలను విశ్వసించరనె విషయం మరోసారి రుజువైంది.
Himachal Pradesh: సంప్రదాయాన్ని గెలిపించిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు
-