నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

-

Corona Updates |దేశంలో కరోనా కేసుల పెరుగుదల తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 5,676 కేసులు నమోదుకాగా.. 21మంది కరోనా బారినపడి చనిపోయారు. అయితే సోమవారం నాటి కేసులతో పోలిస్తే నేడు రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ప్రస్తుతం 37,093 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,42,00,079 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 98.73శాతంగా ఉంది. మరణాలు రేటు 1.19శాతంగా నమోదైంది.

- Advertisement -

Corona Updates |ఇక దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేశారు అధికారులు. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నేడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. మరోవైపు కరోనాను ఎదుర్కొనే కోవోవాక్స్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ధరను రూ.225గా సీరం సంస్థ నిర్ణయించింది. ఈ బూస్టర్ వ్యాక్సిన్ కు డీసీజీఐతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలిపాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ తీసుకున్న వారందరూ ఈ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని సంస్థ తెలిపింది.

Read Also: వైజాగ్ స్టీల్ ప్లాంటుకు వెళ్లిన సింగరేణి అధికారులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...