అప్పటి నుంచి ఢిల్లీలో డీజిల్, పెట్రోల్ వాహనాలకు నో ఎంట్రీ

-

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అనేక రూల్స్ అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్(Arvind Kejriwal) సర్కార్.. తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. టాక్సీలు, ఈకామర్స్ సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే సమకూర్చుకోవాలని సూచించింది. 2030 నాటికల్లా ఇది పూర్తవ్వాలని.. అనంతరం డీజిల్, పెట్రోల్ వాహనాలను రోడ్లపైకి అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ జీవోను మంత్రివర్గం ఆమోదించిందని.. లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమోదం కోసం వేచిచూస్తున్నామని తెలిపింది. దశల వారీగా డీజిల్, పెట్రోల్ వాహనాలను తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తామని రవాణాశాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్(Kailash Gahlot) చెప్పారు. ఇందుకోసం ఢిల్లీలో చార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో దేశంలోనే ఢిల్లీ మొదటిస్థానంలో ఉందని గెహ్లాట్ పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభించిన మోదీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....