అప్పటివరకు రిపేర్లు కుదరవు.. తుంగభద్రపై డిప్యూటీ సీఎం డీకే

-

వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam) 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఆ గేటు మరమ్మతుల కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) కూడా దీనిపై దృష్టి సారించారు. తాజాగా రిపేర్లకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు ఆయన. ఈ గేటు మరమ్మతులకు కనీసం వారం రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తుంగభద్ర ఆనకట్టపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు అప్‌డేట్ ఇచ్చారాయన.

- Advertisement -

 Tungabhadra Dam | ‘క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడానికి సరైన కారణాలు ఇంకా తెలియవు. గేటు, ఇనుస గొలుసు నడుమ చేసిన వల్డింగ్ దెబ్బతినడంతో ఈ ఘటన జరిగిందని ఇంజనీర్లు చెప్తున్నారు. తొలుత రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలి. జలాశయంలో కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ చేసుకుని గేటు పునఃనిర్మాణ పనులు చేపట్టాలయని ఇంజనీర్లను ఆదేశించాం. ఇప్పటికే ఈ అంశంపై హైదరాబాద్, బెంగళూరు, జిందాల్ ఇంజినీర్లను సంప్రదిస్తున్నాం. నీరు తగ్గేవరకూ పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఆనకట్ట భద్రతపై ఏపీ, తెలంగాణ సీఎంలతో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తాం’’ అని వెల్లడించారు.

Read Also: దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నం.. వాణినే కారణం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...