ఇకపై ఆలయాల్లోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ ఉండాల్సిందే!

-

మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ రాష్ట్రంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి సంప్రదాయ దుస్తులే వేసుకుని రావాలని తెలిపింది. ముందుగా నాగ్‌పూర్(Nagpur) జిల్లాలోని నాలుగు ఆలయాల్లో ఈ డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. శ్రీ గోపాలకృష్ణ దేవాలయం(ధంతోలి), శ్రీ సంకత్మోచన్ పంచముఖి హనుమాన్ దేవాలయం(బెల్లోరి-సవనేర్), శ్రీ బృహస్పతి దేవాలయం(కనోలిబార), శ్రీ హిల్‌టాప్ దుర్గామాత ఆలయం(మానవతనగర్)లలో టీ షర్ట్స్, జీన్స్, స్కర్ట్స్, అసభ్యకరమైన పొట్టి బట్టలు వేసుకుని రాకూడదని ఆదేశించింది.

- Advertisement -

Nagpur |త్వరలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో డ్రెస్‌ కోడ్‌ను అమలు చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు, కోర్టులు, పోలీసు స్టేషనల్లో కూడా ఈ డ్రెస్ కోడ్ వర్తిస్తుందని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ సునీల్ ఘన్‌వత్ తెలిపారు. భారతీయ సంస్కృతి, మర్యాదలు, సంస్కృతి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Read Also:
1. శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు
2. దీపారాధన ఏ నూనెతో, ఎలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...