BRS Party |కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ(NCP), సీపీఐ(CPI), టీఎంసీ(TMC) జాతీయ హోదాను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ప్రకటించింది. మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కేసీఆర్‌కు ఈసీ షాకిచ్చింది. ఏపీలో బీఆర్ఎస్(BRS Party) రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైంది. 1964లో సీపీఐ, సీపీఐ(ఎం) విడిపోయాయి. ఆ తర్వాత సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళలో అధికారంలోకి రాగలింది. అయితే సీపీఐకి మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. సీపీఐ క్రమంగా ప్రాభవం కోల్పోయి చివరకు జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సీపీఐకి డి.రాజా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
Read Also: సుప్రీంకోర్టులో కేఏ పాల్‌కు అనూహ్య పరిణామం
Follow us on: Google News, Koo, Twitter