Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

-

తమిళనాడు(Tamil Nadu).. కృష్ణగిరి పాతపేటలో బాణసంచా భద్రపరచిన గోదాం(Firecracker Unit)లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తొంది. మరోవైపు ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Tamil Nadu | ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: పవన్ కల్యాణ్ ‘బ్రో’ వివాదం.. స్పందించిన మంత్రి అంబటి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...