మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాయంలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. రాజధాని భోపాల్‌లోని వల్లభ్ భవన్‌లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వల్లభ్ భవన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సచివాలయానికి చేరుకున్న అధికారులు మంటలు రావడాన్ని గుర్తించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గరయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.