ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే(Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను అస్సాం(Assam)లోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సన్నిహితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 15న అతని సన్నిహితుడు జోగా సింగ్‌ను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో అరెస్ట్ చేయగా.. మరో సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 10న అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ మరియు ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరి అరెస్ట్ లు జరిగాయి. దాదాపు నెల రోజుల క్రితం, పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh)పై లుక్‌అవుట్ సర్క్యులర్ మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి అతడి కోసం పంజాబ్ పోలీసులు వేట ప్రారంభించి ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు.
Read Also: ట్రైలర్ అదుర్స్.. ‘ఉగ్ర’రూపం చూపించిన అల్లరి నరేశ్ (వీడియో)
Follow us on: Google News, Koo, Twitter