Haryana Govt Grants Parole to dera baba for 40 days: డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో డేరాబాబా కు మరోసారి పెరోల్ లభించింది. హర్యానా ప్రభుత్వం ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. గత ఏడాది జూన్ లో నెల రోజుల పాటు పెరోల్ ఇచ్చింది. అయితే మరోసారి పెరోల్ ఇవ్వడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారం ద్వంద్వ ధోరణిని చూపుతుందని విమర్శించారు. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో డేరా బాబాకు(Dera Baba) కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
డేరాబాబా కు మరోసారి పెరోల్.. హర్యానా ప్రభుత్వంపై విమర్శలు
-