తమ సమస్యలను కేంద్రానికి వెల్లడించడం కోసం హర్యాన(Haryana) రైతులు మరోసారి ఢిల్లీ చలో చేపట్టారు. ఇందులో భాగంగా 101 మంది రైతులు హర్యానా నుంచి ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వారిని హర్యానా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
పంజాబ్(Punjab)-హర్యానా(Haryana) సరిహద్దులోని శంభు దగ్గర నిరసనలు తెలుపుతున్న రైతుల్ని ఢిల్లీకి రాకుండా నిలవురించడం కోసం హర్యానా భద్రతా బలగాలు పలు దశల్లో అడ్డంకులు ఏర్పాటు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఢిల్లీ రాష్ట్ర పరిపాలన యంత్రాంగం నుంచి అనుమతి పొందిన తర్వాతే దేశరాజధానికి వెళ్లాలని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: ఆ శక్తులను అణచివేయాలి: ఉపరాష్ట్రపతి
అయితే తమను తాము మర్‌జీవ్రాస్(ఒక లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేసేవారు)గా చెప్పుకుంటున్న రైతుల బృందం ఆదివారం ఢిల్లీకి పాదయాత్రగా కలిసి కదం కదిపింది. కానీ వారి పాదయాత్ర కొన్ని మీటర్ల దూరంలోనే అడ్డంకులను ఎదుర్కొంది. వారిని అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో రైతులను అడ్డుకోవడం కోసం పోలీసులు వాటర్ గన్స్‌ను కూడా వినియోగించారు. ఈ క్రమంలో సదరు రైతులను వెనక్కు రావాల్సిందిగా పిలుపిస్తున్నట్లు రైతుల నేత సర్వాన్‌సింగ్ పంధేర్ తెలిపారు. తమ తదుపరి కార్యాచరణను సోమవారం ప్రకటిస్తామని తెలిపారు.
Follow us on: Google News, Twitter, ShareChat