Deve Gowda | రాజకీయాలకు వీడ్కోలుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ప్రధాని..

-

భారతదేశ మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda).. రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి ఆయన తప్పుకునోనున్నారంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా దేవెగౌడ స్పందించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు తాను విశ్రాంతి తీసుకోనని దేవెగౌడ స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు కూడా క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉంటానని వెల్లడించారు. చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తన రాజకీయ భవితవ్యంపై స్పష్టతనిచ్చారు.

- Advertisement -

‘‘నా వయసు 92 సంవత్సరాలు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు నా పోరాటం కొనసాగుతుంది. నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) గెలిచిన తర్వాత నేను ఇంటికే పరిమితం అవుతానని అనుకోవద్దు. చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటా. పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటా. రాజకీయాల నుంచి తప్పుకుంటానని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా 62 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి చేతకాని ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ప్రమాదంలో పడింది. కర్ణాటకను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఎల్లలు లేకుండా ప్రయత్నిస్తా’’ అని దేవెగౌడ(Deve Gowda) చెప్పారు.

Read Also:  ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘సలార్ 2’ అప్‌డేట్ వచ్చేసింది

Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...