పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు మీకు తెలుసు. కానీ పాకిస్తాన్‌లోనే పుట్టి పెరిగిన పెద్ద ముప్పును దేశ ప్రజలు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖానే పాకిస్థాన్‌కు ప్రమాదకారి. దీన్ని ప్రజలు చూడలేకపోతున్నారు. ఎవరు ఎక్కువ ప్రమాదకరమైన వారు.. ? మన మధ్య ఉన్నవాడా ? మన ఎదురుగా నిలబడినవాడా?” అని ఖ్వాజా ఎం ఆసిఫ్ కామెంట్ చేశారు. ఒక పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మే 9న ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన నిరసనలను ఆయన “తిరుగుబాటు”గా అభివర్ణించారు.