Cheetah helicopter |అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందాల సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ చీతా గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ పైలట్లు లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ గల్లంతయ్యారు. ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి హెలికాఫ్టర్ కాంటాక్ట్ కోల్పోయిందని ఆర్మీ అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: అనుమతిస్తే లోపల.. లేదంటే.. బయట
Follow us on: Google News