సినిమాలు చూసి మంచి నేర్చుకుంటారో లేదో తెలియదు కానీ, చెడు మాత్రం తప్పక నేర్చుకుంటారు. ముఖ్యంగా హీరో స్టైల్‌గా సిగరేట్ తాగడం, మద్యం సేవించడం, అమ్మాయిలను ఏడిపించడం వంటివి అభిమాన హీరోల నుంచే నేర్చుకుంటారు. వారి మేనరిజాలను బయట ఇమిటేట్ చేస్తూ మురిసిపోతుంటారు. కొన్ని సార్లు ఇవి ఆనందాన్ని ఇచ్చినా.. మరికొన్ని సార్లు తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. తాజాగా.. కాన్పూర్(Kanpur) లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు.
Kanpur | ఆ విద్యార్థికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టం. క్రిష్ మూవీలో ఆ హిరో చేసినట్లుగా స్టంట్ చేయాలని అతడు భావించాడు. మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి రెండు కాళ్లపై నిలబడతానని తోటి విద్యార్థులతో చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.