Virat Kohli | విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత

-

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ క్రికెట్‌లో తాను 500వ మ్యాచ్ ఆడాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు చేయడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. పది వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది.

- Advertisement -

కాగా, మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ(Virat Kohli)కి ఇది 76వ సెంచరీ కాగా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంద శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విదేశీ గడ్డపై 2018 తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో వారికన్‌, రోచ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్ అలర్ట్.. ఇవాళే సాయంత్రం 6 గంటలకు!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....