TamilNadu |తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో ఏకకాలంలో 40 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను ఇన్‌కం ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. కాగా, మంత్రి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సెంథిల్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఐటీ అధికారుల వాహనాలను డీఎంకె నేతలు ధ్వంసం చేశారు. అనంతరం ఐటీ అధికారులతో డీఎంకె నేతలు వాగ్వాదానికి దిగారు. ఐటీ అధికారుల బృందంలో ఉన్న మహిళ అధికారిని డీఎంకె(DKM) శ్రేణులు అడ్డుకున్నారు.
Read Also:
1. స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
2. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు
Follow us on: Google News, Koo, Twitter