Jharkhand Camp Politics | హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్న ఝార్ఖండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్తగా కొలువుతీరిన ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో JMM, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. 37 మంది ఎమ్మెల్యేలను షామీర్పేట్ లోని లియోనియా రిసార్ట్స్ లో ఉంచారు. దీంతో ఆ రిసార్ట్స్ చుట్టూ కట్ దిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Jharkhand Camp Politics | ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను టీ కాంగ్రెస్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కి బాధ్యతలను అప్పజెప్పడంతో నిన్నటి నుండి ఆయన ఝార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపులోనే ఉన్నారు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితం చంపయీ సోరెన్ ప్రమాణస్వీకారం చేయగా.. ప్రభుత్వ బలపరీక్షకు డేట్ ఫిక్స్ చేశారు. సోమవారం అసెంబ్లీలో బలం పరీక్షించుకోవాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే సంఖ్యా బలాన్ని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వలలో పడకుండా ఉండడానికి జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) కూటమి జాగ్రత్తలు తీసుకుంటోంది.
Amidst the ongoing political crisis in #Jharkhand, all the MLAs of #JMM and #Congress have reached #Hyderabad by chartered plane, in fear of #poaching and from the airport in two buses they reached #LeoniaResorts in Shamirpet, Hyderabad. #JharkhandPolitics #HemantSoren #Ranchi pic.twitter.com/fWmoXcg6MR
— Surya Reddy (@jsuryareddy) February 2, 2024