Nimmala Ramanaidu | ఎమ్మెల్యే నిమ్మల పాదయాత్రలో అపశృతి.. భారీ అగ్నిప్రమాదం

-

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాదయాత్రలో తారాజువ్వలు పేల్చడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో వెంకటేశ్వర కోకోనట్ గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో గోడౌన్ లోని కొబ్బరి మొత్తం తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొబ్బరి పీచు ఉండటం వలన వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

- Advertisement -

రూ.కోటికి పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala RamaNaidu) పాదయాత్రలో కార్యకర్తలు తారాజువ్వలు పేల్చారు. గోడౌన్ పై నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మంటలు కంట్రోల్ అవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Read Also: భారతరత్న గౌరవం దక్కడంపై స్పందించిన LK అద్వానీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...