హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల నాలుగవ రోజు ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. శివ బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పెట్టుబడులపై అధికారులు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారు అనే కోణంలో నిజాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. సోదరుడు పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఏసీబీ అధికారులు రెరా ఆఫీసు నాలుగవ ఫ్లోర్ లోని బాలకృష్ణ చాంబర్ లో లాకర్ ను బ్రేక్ చేశారు. రూ.12 లక్షలు విలువ చేసే పట్టుచీరలు, రూ.20 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించి పలు ఫోటో ఆల్బమ్ లను కూడా అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. భూములకు సంబంధించిన పాస్ బుక్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.