కర్ణాటకలో బీజేపీకి గట్టి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది(Laxam Savadi) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికారున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు స్పీకర్ విశ్వేశ్వరహెగ్డే కాగేరిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడతంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షెట్టర్‌కు ఈసారి బీజేపీ పెద్దలు టికెట్ నిరాకరించారు. దీంతో అలకబూనిన ఆయన అధిష్టానానికి మూడు రోజులు గడువు ఇచ్చారు. గడువు పూర్తైన కమలంన పెద్దలు ఆయనకు టికెట్ ఇవ్వకపోడంతో కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. 25-30 అసెంబ్లీ సీట్ల గెలుపుపై ప్రభావం చూపే షెట్టర్.. బీజేపీకి రాజీనామా చేయడం ఆ పార్టీ విజయావకాశాలపై గట్టి ప్రభావం చూపబోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...