DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

-

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ తీరుతో, పార్టీ పెద్దల తీరుతో తీవ్ర అసంతృప్తి చెందారని, అందుకే పార్టీ నుంచి బయటకు రావాలని అనుకుంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే సీఎం సీటు ఆశించి నిరాశ చెందిన శివకుమార్‌కు పార్టీ ప్రాధాన్యత తగ్గిందని, ఢిల్లీలోని పెద్దలు సైతం ఆయనను పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీని వదిలి వేరే పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారని, ఈ మేరకు తన అనుచరులతో కూడా చర్చిస్తున్నారన్న వాదన రోజురోజుకు పెరుగుతోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఢీకొడుతున్న బీజేపీలో(BJP) చేరాలని శివకుమార్ ప్లాన్ చేస్తున్నాన్న వాదన వినిపిస్తోంది. కాగా, ఈ వార్తలపై తాజాగా శివకుమార్ స్పందించారు. ‘‘నేను బీజేపీ కి దగ్గరవుతున్న అని నా స్నేహితులు కాల్ చేసి నన్ను అడుగుతున్నారు. నేను జన్మతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పుకొచ్చారు. కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను. మహాకుంభ సందర్శన నా విశ్వాసం. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. బీజేపీకి నేను దగ్గరవుతున్నాననే ఊహాగానాలు నాకు దగ్గరగా కూడా రావు’’ అని స్పష్టం చేశారు. శివకుమార్(DK Shivakumar) వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలకు చెక్ పడింది.

Read Also: రాష్ట్రానికి నిధులు ఇవ్వండి.. మోదీని కోరిన సీఎం రేవంత్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...