కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్(Praveen Sood) నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ ప్రతిపక్ష నేతతో కూడిన సెలెక్షన్ కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ మే 25న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన విరమణ వెంటనే ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ప్రవీణ్ సూద్(Praveen Sood) ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం ఐపీఎస్ పాసై పోలీస్ విభాగంలోకి ప్రవేశించారు. తొలిసారిగా 1986లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా.. పదోన్నతిపై బెంగళూరు డీసీపీగా వచ్చారు. తదుపరి పదోన్నతిపై 2020లో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
Read Also: చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం
Follow us on: Google News, Koo, Twitter