కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Election) ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. క్యూ లైన్లలో నిల్చున్న వారికి 6 దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. సాయంత్రం 5 వరకు 65.69 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో భారీగా ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, కర్ణాటక వ్యాప్తంగా 2615 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 58,545 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగింది. 5.3 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎన్నికల పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు ఉన్నారు. ఈ నెల 13నే ఫలితాలు విడుదల కానున్నాయి.