‘ఐటీ పరిశ్రమలే ఒత్తిడి తెస్తున్నాయ్’.. మంత్రి హాట్ కామెంట్స్

-

ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటలకు పెంచాలన్న ప్రతిపాదన కర్ణాటక(Karnataka) అంతటా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ ఆలోచనను ఐటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సంస్థలు మాత్రం దీనిని అమలు చేయాలని, ఉద్యోగి పని గంటలను రోజుకు 14 గంటలకు పెంచాలని భావిస్తున్నాయి. తాజాగా ఈ ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వ తీర్మానం చేయడం ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనను అధికం చేసింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్(Santhosh Lad) కీలక వ్యాఖ్యలు చేశారు. పని గంటలు పెంచాలని తమ ప్రభుత్వంపై ఐటీ సంస్థలే ఒత్తిడి తెస్తున్నాయని, పని గంటలు పెంచాలన్న ఆలోచన తమది కాదని ఆయన తేల్చి చెప్పారు. చాలా మంది ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అని భ్రమ పడుతున్నారని, అందులో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Karnataka | ‘‘ఉద్యోగుల పని వేళలు పెంచాలంటూ స్వయంగా ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీని వల్లే బిల్లు తీర్మానానికి వచ్చింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుతున్నా. అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది’’ అని చెప్పారు.

Read Also: ‘బాబాయ్ హత్యపై ధర్నా ఎందుకు చేయలేదు’.. ప్రశ్నించిన షర్మిల
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అల్లంతో అదరగొట్టే ఆరోగ్య ప్రయోజనాలు..

మన ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని వైద్య నిపుణులు చెప్తారు....

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...