దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,193 కరోనా(Corona) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో కొత్తగా 42 మంది చనిపోయారని వెల్లడించింది. తాజా కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుంది. దేశంలో కరోనా ప్రారంభమైన దగ్గరి నుంచి 4,48,81,877 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 5,31,300 మంది మరణించారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.660శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ జరిగింది. కరోనా కేసుల పెరుగుదలతో మరోసారి రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా(Corona) ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని.. రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కరోనా వ్యాప్తి తీవ్రతరం కాకముందే నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Read Also: యర్రగొండపాలెంలో రాళ్ల దాడి ఘటనపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు!
Follow us on: Google News, Koo, Twitter