CJI Chandrachud | ‘సీనియర్ లాయర్లు ఆ విషయం నేర్చుకోవాలి’.. సీజేఐ కీలక సూచన

-

యువ లాయర్ల జీతాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(CJI Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ న్యాయవాదులు తమ దగ్గరకు శిక్షణ కోసం వచ్చే యువ లాయర్లకు జీతాలు ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రచూడ్.. సీనియర్ లాయర్లకు ఈ మేరకు సూచన చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తొలిరోజుల్లో పడే పునాదే యువ లాయర్ల భవిష్యత్తును చివరి వరకు నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. న్యాయరంగం చాలా క్లిష్టమైనదని, ఈ విషయాన్ని సీయర్ న్యాయవాదులకు తాను గుర్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాబట్టి యువ లాయర్లకు జీతాలు సరిగా ఇచ్చే పద్దతిని ప్రతి సీనియర్ న్యాయవాది అలవర్చుకోవాలని అన్నారు.

- Advertisement -

‘‘న్యాయవాద వృత్తిలోకి వస్తే తొలిరోజుల్లోనే పెద్ద మొత్తంలో జీతాలు రావు. కష్టపడటం, చేసే పనిలో చిత్తశుద్ది కనబరచడం వంటిని నేర్పించి ఈ రంగంలో నిలబడేలా యువ లాయర్లకు సీనియర్లు ప్రోత్సహించాలి. యువ లాయర్లు ఎంతో నేర్చుకోవాలనే తపనతో వస్తారు. ఎన్నో విషయాలను పంచుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఒకరికొకరు సహకరించుకంటూ వెళ్లాలి. వారి వేతనాలు, పారితోషికాల విషయంలో వ్యవస్థాపరంగానూ తప్పనిసరిగా కొన్ని మార్పులు రావాలి’’ అని CJI Chandrachud పేర్కొన్నారు.

Read Also: ఎలాన్ మస్క్‌పై ఇస్రో ఛైర్మన్ ప్రశంసలు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ISRO Chairman |ఎలాన్ మస్క్‌పై ఇస్రో ఛైర్మన్ ప్రశంసలు..

అంతరిక్ష రంగంలో తన మార్క్ చూపిస్తున్న వ్యక్తి ఎలాన్ మస్క్(Elon Musk)....

Rohit Sharma | ఒత్తిడిని తట్టుకోలేకపోయాం.. టెస్ట్ ఓటమిపై రోహిత్ రుసరుసలు

దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి టెస్ట్‌సిరీస్‌లో ఓటమి పాలయింది....