భారతీయ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న(Bharat Ratna)ను తనకు ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) కృతజ్ఞతలు తెలిపారు. “ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, నా జీవితాంతం నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరవం” అని భారతరత్న అవార్డు దక్కడంపై స్పందిస్తూ ధన్యవాదాల నోట్ రాశారు.
14 ఏళ్ల వయసులో బీజేపీ సైద్ధాంతిక గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన సందర్భాన్ని 96 ఏళ్ల అద్వానీ గుర్తు చేసుకున్నారు. “నేను 14 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో వాలంటీర్‌గా చేరినప్పటి నుంచి ప్రతిఫలం ఆశించకుండా జీవితం నాకు అప్పగించిన ఏ పనిలోనైనా నా ప్రియమైన దేశానికి అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేస్తున్నాను,”. నా జీవితాన్ని ప్రేరేపించినది “ఇదం-నా-మమ” అనే నినాదం. దీని అర్ధం.. “ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసమే.” అని పేర్కొన్నారు.
ఎల్ కే అద్వానీ(LK Advani) తన ధన్యవాదాల నోట్ లో ఇద్దరు అనుభవజ్ఞులు.. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కూడా గుర్తు చేసుకున్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి వారితో సన్నిహితంగా పనిచేసిన ఘనత పొందిన ఇద్దరు వ్యక్తులను ఈ రోజు నేను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నానని రాసుకొచ్చారు.
ఆయన తన పార్టీ కార్యకర్తలకు, తన భార్య కమలకి కూడా లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు. “నేను ప్రజా జీవితంలో నా ప్రయాణంలో పని చేసిన లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులందరూ, ముఖ్యంగా మరణించిన నా ప్రియమైన భార్య కమలకి కృతజ్ఞతలు. వారు నా జీవితంలో గొప్ప బలం, ముందుకు సాగడానికి మూలం.” అలాగే అద్వానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, LK అద్వానీ నవంబర్ 8, 1927న కరాచీలో జన్మించారు. 1980లో బీజేపీని స్థాపించినప్పటి నుండి అత్యధిక కాలం పనిచేసిన అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. అద్వానీ దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ పార్లమెంటరీ జీవితాన్ని సాగించారు. ఆయన అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) మంత్రివర్గంలో మొదట హోం మంత్రిగా, తరువాత ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.
#WATCH | Daughter of veteran BJP leader LK Advani, Pratibha Advani shares sweets with him and hugs him.
Government of India announced Bharat Ratna for the veteran BJP leader. pic.twitter.com/zdYrGumkAq
— ANI (@ANI) February 3, 2024