Mahatma Gandhi grand son Tushar Gandhi sensational comments on Savrkar: మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ వినాయక్ దామోదర్ సావర్కర్ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సే తుపాకీని సావర్కర్ సమకూర్చాడని ఆరోపించారు. సావర్కర్ బ్రిటీష్ వారికి సహకరించటమే కాదు.. బాపూని చంపేందుకు తుపాకీని సమకూర్చడంలో కూడా నాథూరాం గాడ్సేకు సహకరించారు అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. బాపూను హత్యకు రెండ్రోజుల ముందు వరకూ కూడా గాడ్సే వద్ద తుపాకీ లేదని తుషార్ అన్నారు. ఇది ఇప్పుడు తను చేస్తున్న ఆరోపణలు కావనీ.. చరిత్రలో ఈ విషయం నమోదు అయ్యిందని అన్నారు.
పోలీసు రికార్డుల ప్రకారం 1948 జనవరి 26, 27 తేదీల సమయంలో నాథూరాం గాడ్సే, వినాయక్ అప్టేలు సావర్కర్‌ను కలుసుకున్నట్లు ఉందన్నారు. అప్పటి వరకూ గాడ్సే వద్ద తుపాకీ లేదనీ.. గన్ కోసం అతడు ముంబై అంతా వెతికారన్నారు. అనంతరం ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి గ్వాలియర్ వెళ్లినట్లు తుషార్ తెలిపారు. అక్కడే ఆయనకు పిస్తోల్ లభ్యం అయ్యిందని వివరించారు. బాపూ హత్యకు రెండు రోజుల ముందు జరిగింది ఇదే అని అన్నారు. అదే తను చెప్పాలనకున్నదనీ.. కొత్తగా చేసిన ఆరోపణలు ఏమీ లేవు అని తుషార్ గాంధీ మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే ఇటీవలే సావర్కర్ పిరికివాడనీ.. బ్రిటీష్ పాలకలను క్షమాపణ కోరుతూ, సంతకం చేశారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు తాజాగా తుషార్ గాంధీ (Mahatma Gandhi grand son) చేసిన సంచలన ఆరోపణలు ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే.
Savarkar not only helped the British, he also helped Nathuram Godse find an efficient gun to murder Bapu. Till two days before Bapu’s Murder, Godse did not have a reliable weapon to carry out the murder of M. K. Gandhi.
— Tushar (@TusharG) November 19, 2022