Sex Life: మద్యం ఆ పని సులువుగా కానివ్వదు.. జాగ్రత్త సుమా!

-

Alcohol never gives extra energy in Sex Life: మందు తాగి.. ఆ మత్తుతో మంచం ఎక్కితే.. అబ్బాబ్బా ఫుల్‌ ఎంజాయ్‌ చేసేస్తారని అనుకుంటారు చాలా మంది. మద్యం మత్తులో శృంగారం ఎక్కువుగా ఆస్వాదిస్తారని ఊహించుకుంటారు కానీ అవన్నీ కేవలం భ్రమ మాత్రమే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. మద్యం మత్తు లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకుని పడక గదిలోకి వెళ్తే.. ఫర్ఫార్మెన్స్‌ తగ్గుతుందని చెప్తున్నారు. మద్యం జననేంద్రియ ప్రతిస్పందనను తగ్గిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం సెక్స్‌లో నియంత్రణ ఎంతో కీలకం.

- Advertisement -

కానీ.. మీరు ఎంత ఎక్కువగా తాగితే.. మీ జననేంద్రియ ప్రతిస్పందన, శారీరక ఉద్రేకం అంత అధ్వాన్నంగా తయారవుతాయి. మీరు నియంత్రణలో ఉండలేకపోవటంతో.. భాగస్వామిని సంతోషపెట్టలేరు. మద్యం తాగి శృంగారంలో పాల్గొంటే.. భావప్రాప్తి పొందటం చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. పైగా అంగస్తంభన కష్టం అవుతుందని హెచ్చరిస్తున్నారు. మద్యాన్ని అదే పనిగా దాగటం వల్ల శాశ్వత నష్టం, అంగస్తంభనలో లోపాలు ఏర్పడవచ్చునని చెప్తున్నారు. కాబట్టి, మీ భాగస్వామిని మీరు సుఖపెట్టాలని అనుకంటే.. మద్యం తాగకుండానే పడక గదలోకి వెళ్లండి. మరి మీ భాగస్వామిని మీతో పాటు శృంగార మాధుర్యాన్ని ఎంజాయ్‌ చేయాలంటే.. కొన్ని టిప్స్‌ పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు మరి ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుందా రండి

ప్రశాంతమైన వాతావరణం
ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే.. భాగస్వామి మీతో మనసు విప్పి మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే.. తనలోని కోరికలను బయటకు చెప్తారు. మీ రూమ్‌ను మరింత రొమాంటిక్‌గా తీర్చిదిద్దండి. రూమ్‌ అంతా లైటింగ్‌తో నింపేయకండి.. డిమ్‌ లైట్‌తో ఉంచండి. ఆ లైట్‌ మూడ్‌ని మరింత రొమాంటిక్‌గా మార్చుతుంది. మంచి ఫ్రీగరెన్స్‌ వచ్చే వాటిని రూమ్‌లో ఉంచండి. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం (Sex Life) శృంగార కోరికలను పెంచుతాయి.

పరుష మాటలు వద్దు
కొంతమందికి శృంగారం చేసేటప్పుడు కొన్నికొన్ని పదాలు మాట్లాడటం అలవాటు ఉంటుంది. కానీ అవి మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. అందువల్ల కలయిక సమయంలో, పరుష మాటలు మాట్లాడకండి. ఎంత పెళ్లి అయినప్పటికీ, తన ఇష్టాఇష్టాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తనకు ఏవిధంగా శృంగారం చేయాలని ఉందో, భాగస్వామి అభిప్రాయం ఎంతో ముఖ్యం. అతి ఎప్పుడూ మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. తనకు ఇష్టం ఉందో లేదో, లేదా మీ బలవంతంపై శృంగారంలో పాల్గొన్నారా అన్నది స్పష్టంగా తెలుసుకోండి.

అతిగా తిని.. పని మెుదలుపెట్టకండి
శృంగారం చేయటానికి శక్తి అవసరం.. అలా అని అతిగా తినేసి.. సెక్స్‌కు ఉపక్రమించకండి. దీనివల్ల మీకు ఆయాసం తప్ప.. భావప్రాప్తి రాదు. కాబట్టి మితంగా తినండి. శృంగారం అయ్యాక.. ఫ్రెష్‌ అయ్యాక.. తినండి. దీనివల్ల శృంగారంలో ఖర్చు చేసిన క్యాలరీల శక్తిని కూడా తిరిగి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...