ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పిన మమతా బెనర్జీ

-

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు చాలా తక్కువని.. అందుకే వారి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్టు మమతా తెలిపారు. మమతా తాజా నిర్ణయంతో ప్రస్తుతం రూ.10వేలుగా ఉన్న ఎమ్మెల్యేల జీతాలు రూ.50వేలకు పెరగనున్నాయి. ఇక మంత్రుల జీతాలు రూ.10,900 నుండి రూ.50,900కు చేరుకోనున్నాయి. కేబినెట్ మంత్రుల వేతనాలు రూ.11వేల నుండి రూ.51వేలకు పెరగనున్నాయి. ఈ జీతాలకు అలవెన్స్‌లు, ఇతర ప్రయోజనాలు అదనం. వాటిని కలుపుకుంటే ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు అందనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి వేతనంలో ఎలాంటి మార్పులు లేవని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. మమతా సీఎంగా ఎలాంటి జీతం తీసుకోవడం లేదు.

- Advertisement -

ఇండియా పేరును భార‌త్‌గా మారుస్తార‌నే ప్ర‌చారం సాగుతున్న నేప‌ధ్యంలో మమతా స్పందించిన సంగతి తెలిసిందే. దేశంలో చరిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇండియాను భార‌త్ అనే పిల‌వాల‌నేంత‌గా ఒక్కసారిగా ఏం మార్పులు చోటుచేసుకున్నాయ‌ని కేంద్రాన్ని నిల‌దీశారు. జీ20 స‌ద‌స్సు ఆహ్వాన ప‌త్రంలో భార‌త్ అని రాశార‌ని ఆంగ్లంలో ఇండియా రాజ్యాంగమ‌ని పేర్కొంటామ‌ని దీదీ గుర్తు చేశారు. హిందీలో భార‌త్ కా సంవిధాన్ అంటామ‌ని.. అందులో కొత్త విషయం ఏముందని మమతా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...