క్రికెట్‌ ఫ్యాన్స్‌ కి పండగే.. అందుబాటులోకి మరో 4లక్షల ప్రపంచకప్‌ టికెట్లు

-

క్రికెట్ ఫ్యాన్స్‌ కి బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వరల్డ్‌ కప్ టోర్నీకి సంబంధించి మరో 4లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అభిమానుల డిమాండ్ నేపథ్యంలో వివిధ మ్యాచ్‌ లు నిర్వహించే రాష్ట్ర సంఘాలతో మాట్లాడి 4 లక్షల టిక్కెట్లను విక్రయించేందుకు అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 8వ తేది రాత్రి 8 గంటలకు ఈ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుందని వెల్లడించింది. టికెట్లు కావాలనుకునేవారు ఐసీసీ ప్రపంచకప్ వెబ్‌ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ టికెట్ల విక్రయాల తర్వాత మరోసారి కూడా విక్రయాలు చేపడతామని.. దీనిపై త్వరలోనే అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వివరించింది.

- Advertisement -

గతంలోనే టికెట్ల విక్రయం ప్రారంభం కాగా.. టిక్కెట్లు దక్కించుకునేందుకు అభిమానులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో వెబ్‌ సైట్ క్రాష్ అయింది. దీంతో అభిమానుల నుంచి వరుస ఫిర్యాదులు అందాయి. ఐసీసీ, బీసీసీఐ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో బీసీసీఐ మరోసారి టికెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది.

కాగా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌ తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 14న భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఉండనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌ లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...