Karnataka |కర్ణాటకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బస్సులో నిద్రపోతున్న మహిళపై ఓ యువకుడు మూత్రం పోసిన విషయం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. విజయపూర నుంచి ఓ నాన్ ఏసీ స్లీపర్ బస్సు మంగుళూరుకు బయలుదేరింది. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరుకు రాగానే టీ తాగేందుకు ఓ డాబా వద్ద ఆగింది. బస్సులోని కొందరు ప్రయాణికులు దిగి టీ తాగుతుండగా.. కొందరు వాష్‌రూమ్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు.. ముందుసీట్లో కూర్చొని నిద్రపోతున్న మహిళ వద్దకు వచ్చాడు. ఆమెపై మూత్ర విసర్జన చేయగా.. నిద్ర మత్తులో ఉన్న మహిళ ఒక్కసారిగా లేచింది. అనంతరం యువకుడు చేసిన పనికి భయపడి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా బస్సు వద్దకు పరుగెత్తుకొచ్చి యువకుడిని పట్టుకున్నారు. అతని లాగేజీని బస్సులోని నుంచి కిందకు విసిరేసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ నిరాకరించడంతో ఆ యువకుడిపై పోలీసులకు చెప్పలేదని కండక్టర్ తెలిపారు.