ఐశ్వర్యరాయ్ కళ్లపై మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్య మళ్ళీ స్పీడ్ పెంచింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాయ్ పై మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌ కుమార్(Minister Vijay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధులే జిల్లాలో మత్స్యకారుల సంఘంతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి గవిత్ చేపల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ‘బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కళ్లు నిత్యం చేపలు తినడం వల్ల అంత అందంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

చేపలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడమే ఆమె(Aishwarya Rai) అద్భుతమైన కళ్లకు కారణం. చేపలను ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవాలి’ అని ఆమెను ఉదాహరణగా చెప్పడం విశేషం. దీంతో వెంటనే ఈ ప్రకటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ స్పందిస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది’ అని కోరారు.

Read Also: చిరు కొత్త సినిమాలు అనౌన్స్.. లక్కీ ఛాన్స్ కొట్టిన దర్శకులు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...