గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

-

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పిన వైద్యులు తాజాగా ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇందులో ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం తరువుగా చెక్ చేసి.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధారించిందని ఈ బుల్లెటిన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అందించే వైద్యాన్ని నిరంతరం పర్యవిక్షించడానికి వీలుగా ఐసీయూకు తరలించామని స్టార్ హాస్పిటల్స్ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుపుతామని చెప్పారు.

- Advertisement -

కాగా ప్రస్తుతం హరిబాబు(Kambhampati Haribabu)కు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్‌తో పాటు మరికొన్ని ఔషధాలు అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్యాన్ని సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ విక్రమ్ వర్మ జంపన, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ చందన రెడ్డి నేతృత్వంలోనే బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Read Also: కాంగ్రెస్ అలా ఎప్పటికీ కోరుకోదు.. భాష వివాదంపై షర్మిల
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నల్ల మిరియాలతో ఆ సమస్యలకు చెక్..

భారతదేశంలోని ప్రతి వంటగదిలో ఉండే మసాలా దినుసు మిరియాలు(Black Pepper). వీటిని...

మందుబాబులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే మద్యం

నూతన మద్యం పాలసీ రూపకల్పన కోసం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన...