PM kisan samman nidhi | పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నిధులు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బెళగావిలో నిధులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.16,800 కోట్లు జమ అయ్యాయి. కాగా, 12 వ విడత డబ్బులు గతేడాది అక్టోబర్ లో డిపాజిట్ అయ్యాయి. pmkisan.gov.in సైట్ లోకి వెళ్లి BeneficiaryStatusపై క్లిక్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవచ్చు.