రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైన వేళ పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కుండబద్దలు కొట్టారు. ఎలాంటి పొత్తులు ఉండబోవని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లూ గుర్తు చేశారు.
అంతేగాకుండా.. ఎంపీ కోమటిరెడ్డి దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌పైనా థాక్రే స్పందించారు. పార్టీలో ఇంతవరకూ దళిత సీఎం అనే చర్చ జరుగలేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పింది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని ఆదరిస్తుందని అన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలేదని, ఆయనకు పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.
Read Also: ఏపీ మంత్రులపై మరోసారి హరీశ్ రావు సీరియస్
Follow us on: Google News, Koo, Twitter