Need Centre’s Cooperation, PM’s Blessing – Arvind Kejriwal: 15 ఏళ్ళ బీజేపీ పీఠాన్ని భారీ మెజారితో కైవసం చేసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం. మాకు కేంద్రం సహకారం, ప్రధాని మోడీ ఆశీర్వాదం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ ఢిల్లీ(MCD) ఎలక్షన్ లో ఘన విజయం సాధించిన సందర్భంలో … ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ‘ఐ లవ్ యు టూ’ అని అన్నారు. 2015 నుండి ఢిల్లీ అధికారంలో ఉన్నప్పటికీ మొదటిసారి ఢిల్లీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చిందని, ఢిల్లీ ప్రజలు వారి మార్పుతో తమను ఆశీర్వదించారని వారికీ ధన్యవాదాలు తెలిపారు. .
మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ ఢిల్లీ(MCD) ని అభివృద్ధి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ తో కలసి పనిచేయాలని అనుకుంటున్నట్లు కేజ్రీవాల్(Arvind Kejriwal) తెలిపారు. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది.