XBB Covid virus: వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్

-

XBB Covid virus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ వైరస్‌ ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యాలనే కాదు ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసింది. తగ్గుతుందని అనుకున్న కొవిడ్‌ మళ్లి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌‌ పరిశోధకులు ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF-7 మొదటి కేసును గుర్తించిన విషయం తెలిసిందే.. ఒమిక్రాన్ ఉప వేరియంట్లు 300కు పైగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎక్స్‌బీబీ రికాంబినెంట్ వైరస్ (XBB Covid virus) ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

ఈ మేరకు ఈ వైరస్ గురించి పూణెలో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు.. ఎక్స్‌బీబీ రికాంబినెంట్ వైరస్వే రియంట్ ప్రమాదకరంగా ఉందన్నారు. గతంలోనూ ఈ తరహా వైరస్‌లను చూశామని కానీ ఈ వేరియంట్ మనవ రోగనిరోధక శక్తిని దాటుకుని వెళ్లే సామర్ధ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం వందల కొద్ది మరణాలు ఈ వైరస్ వల్ల చోటుచేసుకుంటున్నాయని దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read also: మునుగోడులో గెలిచే పరిస్థితి లేదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...