కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala sitharaman) కూతురి వివాహం నిరాడంబరంగా జరిగింది. బెంగళూరు నగరంలో గురువారం రాత్రి కొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యులు, రాజకీయ నాయకుల సమక్షంలో నిర్వహించారు. జయనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వివాహ వేడుకలు జరిగాయి. ఉడుపిలోని అదమరు మఠానికి చెందిన పురోహితులు ఈ వివాహం జరిపించారు. పరకాల ప్రభాకర్- నిర్మలా సీతారామన్ కుమార్తె వాజ్ఞయి. వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆమె. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేశారు. అమెరికా బోస్టన్, మసాచ్చుసెట్స్‌లో గల నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో జర్నలిజంలో ఎంఎస్ చేశారు.
నిరాడంబరంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ కూతురి వివాహం
-