పొత్తులపై BSP చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మొదటి హామీని తప్పారని, సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కూడా ఎల్లారెడ్డిలో ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు పోరాటం చేస్తున్నారని, అక్కడి మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, అదేవిధంగా హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు విద్యలో రాయితీలను అందజేస్తామన్నారు.

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రూ.105 కోట్లు విడుదల చేసి బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, దోపిడీ కార్యక్రమాలను జరుపుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి దశాబ్ది ఉత్సవాలు కాదని, దోపిడీ ఉత్సవాలని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్, లిక్కర్ స్కామ్ నిరుద్యోగుల పొట్టగొట్టి వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలను నల్ల బజారులో పది లక్షల నుండి కోటి రూపాయల వరకు అమ్ముకొని, బలవంతంగా నిరుద్యోగుల ఇష్టానికి వ్యతిరేకంగా గ్రూప్ 1, మిగిలిన పరీక్షలను నిర్వహిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న సీఎం కూతురు కవితను రక్షించుకునేందుకు ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ దోపిడీకి గురైందన్న బండి సంజయ్ ఏమయ్యాడని, నిరుద్యోగులు, రైతుల గూర్చి ఎందుకు మాట్లాడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని, పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...