దేశవ్యాప్తంగా బీహార్(Bihar) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట జేడీయు అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) చర్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నితీష్ కుమార్ తన CM పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం గవర్నర్ ని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. దీంతో విపక్ష ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. కూటమి నుండి వైదొలగినట్టు అయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఇండియా కూటమి(INDIA Alliance) నుండి వైదొలగారని తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయన భేటీ కానున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తోపాటు బీజేపీ అగ్రనాయకులు బీహార్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో జేడీయూ, బీజేపీ కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రివర్గ విస్తరణ, సార్వత్రిక ఎన్నికల సమాయత్తంపై చర్చలు జరపనున్నారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో ఆర్జేడీ 79, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సీపీఎం ఎల్ 12, సీపీఐ 2, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఎన్నికయ్యారు. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా కూటమిలో భాగంగా నితీష్ కుమార్(Nitish Kumar) కి సీఎం పదవి దక్కింది. అయితే, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో చేతులు కలపడం విశేషం.