Beating: ఆసుపత్రిలో బంధించి ఇద్దరు యువకులను చితకబాదిన నర్సు

-

Beating: బీహర్‌లోని సరన్‌ జిల్లా ఛప్రాలోని ఆసుపత్రిలో యువకులను నర్సు, సిబ్బందిని ఓ గదిలో బంధించి చితకబాదారు(Beating). ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను వీడియో తీసినందకే నర్సు ఆగ్రహంతో కర్రతో తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లడవుతున్నాయి. కాగా, ఛప్రా ఆసుపత్రికి యువకులిద్దరూ మెడికల్‌ సర్టిఫికేట్‌ కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులను తమ ఫోన్లలో వీడియో తీయటం ప్రారంభించారు. ఇది గమనించిన నర్సులు, ఆసుపత్రి సిబ్బంది వారిని వారించి, ఆసుపత్రిలోనే ఓ గదిలో బంధించారు. అనంతరం కర్రలతో కొట్టి, వీడియోలను డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ నర్సు యువకులను కర్రతో కొడతుండగా.. మరో నర్సు ఆమె పక్కనే ఉన్నారు.

- Advertisement -

తమను కొట్టొద్దని ప్రాథేయపడినప్పటికీ నర్సు వారి మాటలను వినకుండా కొడుతూనే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్స్‌ నర్సులపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెట్టగా, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. సదరు యువకులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించటంతో, ఆసుపత్రి సిబ్బంది కొట్టారని.. వారి చేసింది సరైన పనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సదరు ఘటనపై విచారణ జరిపి, నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బిహార్‌ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...