భారతదేశాన్ని క్రీడారంగంలో మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఎన్‌డీఏ(NDA) చెప్పింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. క్రీడలకు పూర్తి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏది ఏమైనా భారత్‌ను అన్ని క్రీడల్లో మేటిగా తయారు చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్‌లో అభివృద్ధి చేయడమే ఎన్‌డీఏ ప్రభుత్వం ధ్యేయమని, వాటిలో క్రీడలకు ఎటువంటి మినహాయింపు ఉండదని అన్నారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలతో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi ) ఈ విషయంపై స్పందించారు.
‘‘ప్రతి ఒక్కరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది భారత్‌కు ఆడిన వాళ్లను, ఆటల పట్ల మక్కువ ఉన్న వాళ్లను ప్రశంసించాల్సిన సందర్భం. క్రీడలకు మద్దతుగా నిలవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆటలపై ఆసక్తి చూపేలా, క్రీడాల్లో రాణించేలా యువతను ప్రోత్సహిస్తాం. వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తాం’’ అని PM Modi పేర్కొన్నారు.