ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(Pakistan PM) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘోర విషాదంలో తమ ఇష్టమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అలాంటి ఘటన జరగడం దురదృష్టకరం’ అని ఆయన(Pakistan PM) ట్వీట్ చేశారు. ఈ ప్రమాద ఘటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky), కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం స్పందించారు. రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ తరఫున, తమ దేశాల ప్రజల తరఫున రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.