కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

-

PM Modi |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 136 స్థానాల్లో అద్భుతమైన మెజార్టీ దక్కించుకుంది. అధికార బీజేపీని కర్ణాటక ప్రజలు 65 స్థానాలకు పరిమితం చేశారు. కింగ్ మేకర్ అవుతారని భావించిన జేడీఎస్(JDS) నేతలు కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించారు. 2018తో పోలిస్తే అదనంగా కాంగ్రెస్(Congress) పార్టీ 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా పాతింది. 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ(BJP) 39 స్థానాలు కోల్పోయింది. గత ఎన్నికలతో పోలిస్తే జేడీఎస్ సైతం 18 స్థానాలు కోల్పోయింది. తాజాగా.. కర్ణాటక ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. కన్నడ ప్రజల ఆకాంక్షాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sandhya Theater Incident | సంధ్యా థియేటర్ ఘటనపై డీజీపీకి NHRC నోటీసులు

Sandhya Theater Incident | సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట...

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...