PM Modi | అయోధ్యకు రాముడు తిరిగొచ్చాడు.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం..

-

మన బాలరాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసం లేదని.. ఇక నుంచి రామ మందిరంలోనే ఉంటాడని ప్రధాని మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మోదీ ప్రసంగించారు. ‘జై సియా రామ్‌’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని తెలిపారు. త్రేతాయుగంలో శ్రీరాముడు 14 ఏళ్లు అయోధ్యకు దూరంగా ఉంటే.. ఇప్పుడు మళ్లీ అయోధ్యకు రావడానికి శతాబ్దాలు పట్టిందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని.. కానీ అంతిమంగా న్యాయమే గెలిచిందన్నారు. రామమందిర(Ram Mandir) కలను సాకారం చేసినందుకు ముఖ్యంగా న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు చెబుతానన్నారు. జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని.. వెయ్యేళ్ల తర్వాత కూడా జనవరి 22 గురించి మాట్లాడుకుంటారని ఆయన పేర్కొన్నారు. అద్భుత ఘట్టమైన ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోందని.. ఇవాళ రాత్రి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని మోదీ(PM Modi) పిలుపునిచ్చారు. రామమందిరం విషయంలో కొంత మంది వ్యక్తుల ఆలోచనా ధోరణి మార్చుకోవాలని సూచించారు.

కాగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన పూర్తికావడంతో 11రోజులుగా చేస్తున్న కఠిన దీక్షను మోదీ ముగించారు. ప్రధాన అర్చకులు గోవింద్ దేవ్‌ గిరి మహరాజ్‌ పవిత్ర తీర్ధాన్ని మోదీకి అందించి దీక్షను విరమింపజేశారు.

Read Also: అపూర్వం.. అమోఘం.. గర్భగుడిలో కొలువుదీరిన కోదండరాముడు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...